గుంటూరు: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మృతుల ఫోటోలతో కుటుంబ సభ్యులు ఆందోళన
Guntur, Guntur | Sep 19, 2025 గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో సంభవించిన మరణాలను కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అసలు నిజాలు పక్కదారి పట్టిస్తుందని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు అన్నారు. తురకపాలెం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం గుంటూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద మృతుల ఫోటోలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లెల వెంకటరావు మాట్లాడుతూ చనిపోయిన వారిపైనే నిందలు వేసే దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది అన్నారు. సమీప క్వారీలో కలుషితమైన నీరు త్రాగడం వల్లనే మరణాలు సంభవించాయి అని తెలిపారు.