ఐనవోలు: రాంనగర్ లో తాటిచెట్టు పైనుంచి జారిపడి బుర్ర సాంబరాజు అనే గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. కళ్ళు గీసేందుకు వెళ్లి తాటిచెట్టు పైనుంచి జారిపడి బుర్ర సాంబరాజు అనే గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కల్లుగీత జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న సాంబరాజు అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణనతీతంగా మారింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.