ఒంగోలు అర్బన్: బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం మత్తులో బంధుమిత్రుల మధ్య గొడవ తీవ్ర గాయాలు ముగ్గురిపై కేసు నమోదు
Ongole Urban, Prakasam | May 27, 2026
కలిసి మద్యం తాగేందుకు బార్ కు వెళ్లిన అని స్నేహితులు మద్యం మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. ఒంగోలులో పాత మార్కెట్ లో ఉన్న కేవీస్ బార్ లో యువకుల హల్చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ..ఒంగోలు ఈమని పాలెం కి చెందిన ప్రేమ్ కుమార్ అజయ్ లు ఇద్దరు బంధుమిత్రులు.. అజయ్ కి ప్రేమ కుమార్ కి కొద్ది రోజులుగా వారి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి అని తెలిసింది..అజయ్ , ప్రేమ కుమార్ మరియు అతని స్నేహితులు అందరు కలిసి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగుతూ ఉన్న సందర్భంలో ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా అజయ్ మై దాడి చేయగా తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు