ఒంగోలు అర్బన్: ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్యశ్రీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఇన్ ఛార్జ్ రవిబాబు
Ongole Urban, Prakasam | Apr 5, 2026
ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో పరామర్శకు వెళ్లిన వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఓపీలు తీసుకోవడంలేదని, పేదలకు వైద్యం భారంగా మారిందని దుయ్యబట్టారు. వైఎస్సార్, జగన్ హయాంలో ఆరోగ్యశ్రీతో అండగా నిలిచామని, నేడు కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు.