మైదుకూరు: కడప జిల్లాలో కృష్ణా జలాల ప్రవాహం..!
కృష్ణా జలాలు కడప జిల్లాలోకి ప్రవేశించాయి. చాపాడు మండల పరిధిలోని కుందూ నదిలోకి జలాలు చేరాయి. మూడు రోజుల క్రితం శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న ఈ నీరు కుందూలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం నదిలో 15 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.