అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కందుకూరు సోమలదొడ్డి గ్రామాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కందుకూరు సోమలదొడ్డి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రజలు ఈ కార్యక్రమానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.