సంగారెడ్డి: లింగమయ్య గుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసిన సంగారెడ్డి రూరల్ పోలీసులు
పసల్వాది గ్రామ శివారులోని లింగమయ్య కుంటలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు మూడు రోజుల క్రితం పఠాన్‌చెరు ప్రాంతంలో మిస్సైన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.