బుగ్గానిపల్లెలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Dhone, Nandyal | Apr 30, 2025 బేతంచెర్ల మండలం లోని బుగ్గానిపల్లె గ్రామంలో జింక సుధాకర్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జింక సుధాకర్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బేతంచెర్ల ఏపీఎం మధుసూదన్, సీసీలు, అకౌంటెంట్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.