ఒంగోలు అర్బన్: నగరంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
ఒంగోలు కార్పోరేషన్ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు కార్పోరేషన్ పరిధిలోని బొల్లినేనిపాలెం, కమ్మపాలెం తదితర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కమ్మపాలెం పరిధిలోని బొల్లినేనిపాలెం ను సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.