నంద్యాల అర్బన్: నంద్యాలలో మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం, వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, సమాచార పౌరసంబంధాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు ఆరోగ్య పరీక్షలు చేయించుకునారు