కడప: నేటి నుంచి ఆందోళనకు శ్రీకారం: సిఐటియు మున్సిపల్ నగర అధ్యక్షులు సుంకర రవి
Kadapa, YSR | Sep 16, 2025 నేటి నుంచి ఆందోళనకు శ్రీకారం చుడతామని సిఐటియు మున్సిపల్ నగర అధ్యక్షులు సుంకర రవి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనగరపాలక సంస్థలో పారిశుధ్య, ఇంజినీరింగ్ సెక్షన్లో కార్మికులుగా పని చేస్తూ మృతి చెందిన, ఉద్యోగ విమరణ పొందిన కార్మికుల కుటుంబాలు వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. సంపాదిస్తున్న కుటుంబ పెద్ద, తల్లి, తండ్రి మృతి చెందడంతో ఆయా కుటుంబాలు ఆర్ధికంగా వెనుకబడి జీవనం సాగించడమే కష్టంగా మారింది. రెగ్యులర్ ఉద్యోగులు మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అవసరమైతే కారుణ్య నియామకాలు చేపడుతారు.