పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
పెంచిన నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించినారు. సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరల పెరుగుదలకు అడ్డే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇంకా ఇవ్వలేదని పోలవరం నిర్వాసితులకు నష్టపాహారం పునరావస కాలనీలో అభివృద్ధి చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.