సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామంలో ఆదివారం ఆరు గంటల సమయంలో కనగానపల్లి టిడిపి మండల కన్వీనర్ పోతుల ఆధ్వర్యంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మహిళా క్రికెట్ టీం గెలవాలని మాధవ రాజుల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య మాట్లాడుతూ పరిటాల సునీత ఆదేశాల మేరకు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా మహిళా క్రికెట్ టీం గెలవాలని పూజలు నిర్వహించి 101 కొట్టి మహిళా క్రికెట్ టీం గెలవాలని స్వామిని కోరుకోవడం జరిగిందని టిడిపి మండల కన్వీనర్ పోతులయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర యాదవ్ మాదన్న తదితరులు పాల్గొన్నారు.