అనంతపురం అర్బన్: కళ్యాణదుర్గం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్ తగిలి మహారాష్ట్రకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కళ్యాణదుర్గం సమీపంలో లారీ టాప్ పై ప్రయాణిస్తున్న మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ అనే కార్మికుడికి విద్యుత్ లైన్ తగలడంతో విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గురువారం సాయంత్రం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.