చందుర్తి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయం: ఎస్పీ మహేష్ బి.గీతే
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పోలీస్ స్టేషన్ పరోధిలోని క్రిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 09 సీసీ కెమెరాలను,పోలీస్అధికారులు,గ్రామప్రజలు,ప్రజాప్రతినిధులతో కలసి రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీతే శుక్రవారం ప్రారంభించారు.గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనియమని,మిగిలిన గ్రామ ప్రజలు కూడా స్వీయారక్షణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు.ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని,గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని అన్నారు.