నంద్యాల అర్బన్: TDP మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం పై హర్షం వ్యక్తం చేసిన నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరిత
Nandyal Urban, Nandyal | May 29, 2026
మహిళ సాధికారిక బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టకపోయినా లోకేష్ మహానాడులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మహిళలు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేసిందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం పై హర్షం వ్యక్తం చేశారు