డోన్: బేతంచర్ల పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు సిఐ వెంకటేశ్వరరావు వార్నింగ్
Dhone, Nandyal | May 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని గ్రామాల్లో ఉన్న రౌడీషీటర్లు ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరావు హెచ్చరించారు. ఆదివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.