ఎన్టీఆర్ వైద్య సేవలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దు - పరిటాల శ్రీరామ్
ఎన్టీఆర్ వైద్య సేవలు గురించి వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. సోమవారం ధర్మవరం టిడిపి క్యాంపు కార్యాలయంలో పదిమంది అర్హులైన వారికి 9.95 లక్షలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రభుత్వం నిలిపి వేయలేదని కొనసాగిస్తుందని అన్నారు.