75 తాళ్ళూరు: టీడీపీ కళాకారుల ప్రచార రథంపై రాళ్ళదాడి.
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కళాకారుల ప్రచార రథంపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాళ్ల దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రచార రథం అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చింపివేశారు. ఈ ఘటనలో కళాకారులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.