కౌశల్ క్విజ్ పోటీలలో జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం యలగలవంక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి సందీప్ కు గురువారం జిల్లా కేంద్రంలో డీఈఓ కార్యాలయంలో DEO ప్రసాద్ బాబు డిప్యూటీ DEO మల్లారెడ్డి, యలగలవంక సైన్స్ ఉపాధ్యాయుడు సూరిబాబులతో కలసి మెమెంటో, ధృవీకరణ పత్రాలతో అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభను చాటాలని డీఈవో సూచించారు.