చింతమండి క్రాస్ వద్ద రహస్య సమాచారం మేరకు బెల్ట్ షాపులపై కార్వేటి నగరం ఎస్సై తేజస్విని ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, పాల సముద్రంకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది రాజశేఖర్, యువరాజు, సుల్తాన్ పాల్గొన్నారు.