ఒంగోలు అర్బన్: పోలీస్"ప్రజా సమస్యల పరిష్కార వేదిక"కార్యక్రమంకు 66 ఫిర్యాదులు
Ongole Urban, Prakasam | May 25, 2026
ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాదు దారుల అర్జీలను జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. నడవలేని వారి వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. l