నంద్యాల అర్బన్: తమ్మరాజు పల్లె వద్ద లారీ బోల్తా, డ్రైవర్ కు తీవ్ర గాయాలు, తప్పిన పెను ప్రమాదం
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని తమ్మరాజు పల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్హెచ్-40 పై కర్నూలు వైపు వెళ్తున్న లారీ, పెట్రోల్ పంపు వద్ద ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ బోల్తా పడటంతో డ్రైవర్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పాణ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.