ఒంగోలు అర్బన్: చంద్రబాబు వెన్నుపోటు ర్యాలీని జయప్రదం చేయండి: వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి
Ongole Urban, Prakasam | Jun 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం జరగబోయే చంద్రబాబు వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసిపి శ్రేణులకు ఒంగోలు నియోజక వర్గ వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవిబాబు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఇన్చార్జ్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే చంద్రబాబు వెన్నుపోటు ర్యాలీని జయప్రదం చేయాలని గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. ర్యాలీ ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవనం నుండి ప్రారంభమై కలెక్టరేట్ వరకు జరుగుతుందని తెలిపారు