ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలంలో పర్యటించి ఉపాధి హామీ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం కొత్తపట్నం మండలంలోని పల్లె పల్లి గ్రామంలో పర్యటించారు. ఉపాధి హామీ పనులను పరిశీలించి వేసవికాలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించి చెప్పారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలానే ఉపాధి కూలీల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు.