ఒంగోలు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజా పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జగన్ పర్యటన స్థానిక మత్స్యకారులకు అవసరం లేనిదని, వారు స్వచ్ఛందంగా బహిష్కరించారని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల గైర్హాజరు ఈ సమావేశానికి ప్రజల మద్దతు లేదనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. “మీరు ఇక్కడ అవసరం లేదు… మాకు మీ జోక్యం అవసరం లేదు” అనే భావన స్థానిక ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు. అయితే, సమావేశాన్ని విజయవంతంగా చూపించేందుకు బయట జన సమీకరణ చేశారన్నారు