డోన్: తన భర్త ఆచూకీ తెలిపాలంటూ కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బేతంచెర్ల కు చెందిన మహిళ నిరసన
Dhone, Nandyal | Jun 21, 2026 కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బేతంచెర్లకు చెందిన రిజ్వాన తన కుమారునితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తన భర్త ఆచూకీ తెలియజేయాలని బేతంచెర్ల సీఐ చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి, తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు