నంద్యాల అర్బన్: నార్వేలో పర్యటిస్తున్న నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నార్వే పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా 4వ రోజు ఆమె తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రసిద్ధ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ 'కెశాట్' (KSAT)ను సందర్శించారు. అంతరిక్ష సాంకేతికత ద్వారా సమాచార వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నివారణ రంగాలలో వస్తున్న సరికొత్త మార్పులను అక్కడి ప్రతినిధులతో చర్చించి తెలుసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.