డోన్: డోన్ మండలంలో పోలీసుల ఆకస్మిక దాడులు,పదిమంది అరెస్ట్, 78 లీటర్ల నాటసార స్వాధీనం
Dhone, Nandyal | Jul 7, 2026 డోన్ మండలం కనపకుంట, ఎర్రగుంట్లలో నాటుసారా విక్రయాలు, పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో రూరల్ సీఐ రాకేశ్, ఎస్ఐ మమత సిబ్బందితో సోమవారం దాడులు చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 78 లీటర్ల సారా, రూ.16,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.