ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన డిఎస్పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | May 24, 2026
ఒంగోలు పట్టణంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం డిఎస్పి శ్రీనివాసరావు సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సైక్లింగ్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సైకిల్ తొక్కడం వల్ల కలుగు ప్రయోజనాలను డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు వివరిస్తూ పట్టణంలో సైకిల్ తొక్కారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల కలుగు ఆరోగ్య ప్రయోజనాలను సిబ్బందికి డిఎస్పీ తెలిపారు.