ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఎస్పీ దామోదర్
Ongole Urban, Prakasam | Jul 6, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలులోనిఎస్పీ కార్యాలయంలో జులై 7వ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వారి సమస్యలపై ఇచ్చే అర్జీలను పరిశీలించి సంబంధిత నియోజకవర్గ పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.