అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా నార్పల లో బీహార్ కు చెందిన కార్మికుడి పై స్థానిక వ్యాపారి కట్టెలతో దాడి పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో బీహార్ కు చెందిన శంభో మహాతే అనే కార్మికుడి పై జైపాల్ రెడ్డి అనే స్థానిక వ్యాపారి కట్టెలతో దాడి చేసి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం వారు మీడియాకు వివరాలను వెల్లడించారు. స్టార్ లైట్స్ అనే సంస్థ నిర్మించే విద్యుత్ శాఖకు సంబంధించిన భారీ టవర్ల నిర్మాణానికి వీరు కార్మికులుగా పనిచేస్తారని తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.