జిల్లాలో పడే ప్రతి నీటిబొట్టును వృధా కానివ్వకుండా సప్లై చానల్స్ ద్వారా చెరువులు నింపే ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల, వెలిగల్లు ప్రాజెక్టు అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు.శనివారం రామాపురం మండలంలోని నల్లగుట్ట పల్లి పంచాయతీ బి.రాచపల్లి గ్రామ పరిధిలోని రామరాజు వంక నుండి బల్లిగుట్ట చెరువు సప్లై ఛానల్ పనుల ను, రామరాజు వంక చెక్ డాం నిర్మాణానికి సంబంధించిన పనులను, రామరాజు వంక నుండి ఓబుల్ రెడ్డి చెరువు, కసిరెడ్డి చెరువుకు, దిగువ చింతల వారి కుంట, చింతకుంట నింపు సప్లై ఛానల్ పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి దీనికి సంబంధించిన పనులన్నీ త్