ఒంగోలు అర్బన్: ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో సైబర్ నెరగాళ్లు మోసం:అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 6, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆన్లైన్ జాబ్స్ పేరిట మోసాలు జరుగుతున్నాయని నిరుద్యోగ యువత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల టెలిగ్రామ్ చానెల్స్ లో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తామని యువకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తర్వాత అకౌంట్ డిఆక్టివేట్ చేస్తున్నారని ఈ విషయాన్ని యువత గమనించి జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్ లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా జరుగుతున్న జాబ్ మేళాలను వినియోగించుకొని యువత ఉద్యోగాలు పొందాలని ఎస్పి సూచించారు.