గుంటూరు: వాట్సాప్ కి వచ్చిన లింక్ క్లిక్ చేసి అకౌంట్లో నగదు పోగొట్టుకున్న బాధితుడు.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Guntur, Guntur | Sep 15, 2025 పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనందపేటకు చెందిన మొహమ్మద్ మిజమ్మిల్ అనే 40 సంవత్సరాల వ్యక్తి తన వాట్సప్ కి వచ్చిన లింకు క్లిక్ చేసి అకౌంట్లో ఉన్న 1,18,167 రూపాయలను పోగొట్టుకున్నట్లు పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్ సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధితుడు 1903 ద్వారా వెంటనే సైబర్ క్రైమ్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.