డోన్: సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి: డోన్ సీనియర్ సివిల్ జడ్జ్ కెవి రామకృష్ణయ్య
Dhone, Nandyal | Jun 19, 2026 నంద్యాల జిల్లాడోన్లోని గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థినులకు పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అంశాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య పాల్గొని విద్యార్థినులకు చట్టం ప్రాముఖ్యతను వివరించారు. అనుచిత ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు