మా ఎంపీపీ పాఠశాల మా గ్రామంలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్న కొయ్యూరు మండలంలోని నడింపాలెం గ్రామస్తులు
మా ఎంపీపీ పాఠశాల మా గ్రామంలోనే ఉండాలని కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం పంచాయతీ నడింపాలెం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు మంగళవారం పాఠశాల ఎదుట పిల్లలతో కలిసి నిరసన తెలిపారు. తమ పాఠశాలలో 1 నుంచి 5వరకూ తరగతులు ఉండేవన్నారు. అయితే ఇప్పుడు 1,2 తరగతులే ఉన్నాయని, 3,4,5 తరగతుల పిల్లలను ఎం.మాకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూల్‌కు తరలించాలని చూడడం సరికాదన్నారు. వేరే గ్రామానికి వెళ్లాలంటే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.