నంద్యాల అర్బన్: నంద్యాలలో అర్ధరాత్రి దొంగల హల్చల్
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల బస్టాండ్ సమీపంలోని అంజుమన్ స్ట్రీట్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు కలకలం రేపారు. ఒక ఇంట్లోకి చొరబడి మొబైల్ చోరీ చేసిన నిందితుడు, ఇతర ఇళ్లలోనూ దొంగతనానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎండల కారణంగా తలుపులు తెరిచి ఉంచే ఇళ్లే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.