డోన్: ఈనెల 9 వరకు పాలీసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు : బేతంచర్ల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి
Dhone, Nandyal | Apr 7, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 9 వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు ఈ నెల 24 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.