ఆత్మకూరు: ఆత్మకూరు చెరువులోకి ఈతకు వెళ్లి నీట మునిగిన యువకుడు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు చెరువులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగాడు. నీట మునిగిన యువకుడు నలిశెట్టి మహేష్ గా స్థానికులు గుర్తించారు. గ్రామంలో ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. పలువురు చెరువులో సరదాగా ఈతకు వెళ్తుండడంతో వారితో పాటు మహేష్ వెళ్లాడు. చెరువులోకి దిగి కొద్దిసేపటికి తాను ఈత కట్టలేకపోతున్నానని కేకలు వేయడంతో కొందరు అతని రక్షించే ప్రయత్నం చేసిన నీట మునిగి పోయాడు. దింతో సమాచారం అందుకున్న సిఐ గంగాధర్ రావు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.