కనిగిరి: మాచవరంలో మహిళను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ధర్నా
కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట మహిళను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ... కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళను అదే గ్రామానికి చెందిన ప్రకాశం అనే వ్యక్తి రూ.10 లక్షలు నగదు తో పాటు 13 సవర్ల బంగారం తీసుకొని మోసం చేశారన్నారు. ప్రకాశం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎస్సై శ్రీరామ్ మాట్లాడుతూ... వారం రోజుల్లో మహిళలు మోసం చేసిన ప్రకాశం పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.