నందికోట్కూరు: మిడుతూరు ప్రభుత్వంలో 4.5 కేజీల బాల భీముడు జననం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 4.5 కేజీల బాల భీముడు జన్మించాడు. గడివేముల గ్రామానికి చెందిన బాలఉశేనమ్మ ప్రసవం నిమిత్తం ఆస్పత్రికి రాగా ఆమెకు సాధారణ ప్రసవం చేసినట్లు డాక్టర్ సాయి సుధా తెలిపారు.ఇంత బరువు గల బాబు పుట్టడం ఇదే మొదటిసారి.ఈ బాబును చిన్న పిల్లల డాక్టర్ కే తిరుపతి పరీక్షించగా బాబు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది ముర్తుజావలి,శ్యామల, అనురాధ,సుజాత సువార్తమ్మ పాల్గొన్నారు.