కరీంనగర్: నగరంలో RTO అధికారులు వాహన తనిఖీలు, సరైన దృవపత్రాలు లేని 15 వాహనాలను సీజ్
కరీంనగర్ RTO, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని వన్ టౌన్ ముందు మంగళవారం ప్రత్యేక వాహన తనిఖీలను నిర్వహించారు. వాహనదారుల భద్రత కొరకు ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు. ఈ వాహన తనిఖీలు గత 15 రోజుల నుంచి కొనసాగుతుందని, ఇప్పటివరకు 300 కు పైగా వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీలలో 15 వాహనాలను పట్టుకుని సీజ్ చేశామని, వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు తీసుకొని వచ్చి ఫైన్ కట్టి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు.