బనగానపల్లె: బనగానపల్లె మండలం లో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
బనగానపల్లె మండలం పలుకూరులో రైతు సంఘం సభ్యత్వ క్యాంపెయిన్ కార్య క్రమాన్ని శనివారం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు రైతులు సంఘంలో సభ్యులుగా చేరి రైతు ఉద్యమానికి సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా జిల్లెల్ల సుబ్బారెడ్డి, కార్యదర్శిగా పుల్లయ్య యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.