కాచిగూడ రైల్వే ట్రాక్ వద్ద కారు వదిలేసిన ఘటన నగరాన్ని కుదిపేసింది. పోలీసుల వివరాలిలా.. ట్రాక్ కింద రోడ్డుపై అడ్డంగా దుండగుడు కారు వదిలేసి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించారు. దీంతో కాచిగూడ రైల్వే ట్రాక్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు.