అమీర్‌పేట్‌లోని బుద్ధానగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నక్కా సుధాకర్ గౌడ్ మృతిచెందారు. ఆయన మరణంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.