కోడుమూరు: కోడుమూరు పట్టణంలో విద్యుత్ వినియోగదారులపై సైబర్ నేరగాళ్లు వల, అప్రమత్తమైన వినియోగదారులు
కోడుమూరు పట్టణంలో విద్యుత్ వినియోదారులపై సైబర్ నేరగాళ్లు వలపన్నారు. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు విద్యుత్ బిల్లుకు అదనంగా ఏ సి డి బిల్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు సమయం కోరినా పట్టించుకోలేదు. ఫోన్ పే ద్వారా పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అటువంటి వసూళ్లు చేయడం లేదని అధికారులు వారికి తెలియజేశారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.