కరీంనగర్: బోనాలప ల్లి గ్రామం పై బుల్లెట్ల వర్షం, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు
కొత్తపల్లి మండలం బోనాల పల్లె గ్రామంలో పోలీస్ తూటాలకు గ్రామస్తులు భయపడుతున్నారు. దశాబ్ద కాలంగా ఎలగందుల గుట్టలలో పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. గుట్టలు గ్రానైట్ క్వారీ వల్ల తరిగిపోతుండడంతో ప్రాక్టీస్ చేసే సమయంలో బుల్లెట్లు తమ గ్రామం పై పడుతున్నాయని మంగళవారం గ్రామస్తులు వాపోయారు. ఈనెల 20న ప్రాక్టీస్ చేసే సమయంలో బుల్లెట్ దూసుకు రావడం వల్ల అమృతమ్మ అనే వృద్ధురాలికి గాయాలైనట్లు తెలిపారు. గ్రామంలో పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలో బులెట్ పడ్డట్లు గ్రామానికి చెందిన ఓ మహిళ తెలిపింది.బుల్లెట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.