ఒంగోలు అర్బన్: పేదలకు పెన్షన్ పంపిణీ చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Aug 1, 2026
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రతినెల 1వ తేదీన పెద్ద మొత్తంలో ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీయే దీనికి నిదర్శనమని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మితో కలిసి శనివారం ఆయన దర్శి పట్టణంలోని సందువారిపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని కలెక్టర్ తెలిపారు.