నారాయణపేట్: కలెక్టరేట్ ప్రజావాణి హాలులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
వీర నారీ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో శుక్రవారం 11 గంటల సమయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్ లు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మొలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.